News December 19, 2024
ఎంపీ ధర్మపురి అరవింద్ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

ఎంపీ ధర్మపురి అరవింద్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పీఎస్‌లలో నమోదైన కేసుల్లో విచారణాని ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. బంజారాహిల్స్, అబిడ్స్ పీఎస్‌లలో అరవింద్‌పై 3 కేసులు నమోదు అయ్యాయి. అప్పటి సీఎం కేసీఆర్‌ను కించపర్చేలా మాట్లాడారంటూ ఫిర్యాదులు రాగా, కేసులను కొట్టేయాలంటూ అరవింద్ పిటిషన్లు దాఖలు చేశారు.
Similar News
News January 30, 2026
NZB: కార్పొరేషన్ ‘హస్త’గతం కోసం యత్నాలు

గత కార్పొరేషన్ ఎన్నికల్లో 2 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠం హస్తగతం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు గెలుపు గుర్రాల కోసం ఇప్పటికే సర్వేలు పూర్తి చేసింది. అవసరమైతే AIMIM పొత్తు పెట్టుకుని తమ అభ్యర్థిని మేయర్ చేయాలని ఎత్తుగడలు వేస్తున్నారు.
News January 30, 2026
NZB: మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలి: కలెక్టర్

ప్రైవేటు, కార్పొరేటు హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేయాలని NZB జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం నిర్వహించిన వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరుపేదలకు సేవలందించే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. DMHO రాజశ్రీ పాల్గొన్నారు.