News January 21, 2026
ఎంపీ మల్లు రవి క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

TG: ఎంపీ మల్లు రవి, అలంపూర్ MLA విజయుడు మధ్య <<18912878>>వాగ్వాదంపై<<>> KTR ఫైరయ్యారు. ఎమ్మెల్యేపై ఎంపీ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని Xలో పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతల దిగజారుడుతనానికి ఇది నిదర్శనమని దుయ్యబట్టారు. దాడిని ఖండిస్తూ, మల్లు రవి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. CM రేవంత్ నైతిక బాధ్యత వహించి ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 13, 2026
ఒంటరితనంతో ఎన్నో అనారోగ్యాలు

ఒంటరితనం అనుభవించేవారిలో ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. దీర్ఘకాలంలో ఒంటరితనంతో బాధపడుతున్నవారిలో టైప్ 2 డయాబెటిస్, జ్ఞాపకశక్తి తగ్గడం, త్వరగా వృద్ధాప్యం రావడం, గుండె జబ్బులు వంటివి ఎక్కువవుతాయంటున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే క్లోజ్ అనిపించే వ్యక్తితో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని, వీలైనంత ఎక్కువమందితో కమ్యునికేట్ చేయాలని సూచిస్తున్నారు.
News February 13, 2026
ఒకప్పుడు అసెంబ్లీ బూతులకు నమూనాగా ఉండేది: చంద్రబాబు

AP: చట్టసభ అనేది ప్రజా దేవాలయమని సీఎం చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు నమూనాగా ఉండేదని వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ కూడా నిర్వహించామన్నారు. సభలో సభ్యులకంటే స్టూడెంట్సే బాగా మాట్లాడారని ప్రశంసించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడారు.
News February 13, 2026
మున్సిపల్ ఎన్నికలు.. ఖాతా తెరిచిన జనసేన

TG: మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు 336 వార్డుల్లో పోటీ చేయగా ప్రస్తుతానికి ఓ చోట గెలుపొందారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పొత్తుతో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి 14వ వార్డులో విజయం సాధించారు. అక్కడ 15 వార్డులుండగా కాంగ్రెస్ 9 వార్డుల్లో, బీఆర్ఎస్ 5 వార్డుల్లో గెలిచాయి. దీంతో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ వశమైంది.


