News July 20, 2024

ఎంపీ విజయసాయి రెడ్డితో చంద్రశేఖర్ రెడ్డి భేటీ

image

ఢిల్లీలో చేపట్టబోయే దీక్షకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎంపీ విజయసాయి రెడ్డితో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి చర్చించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యను నిరసిస్తూ ఈ నెల 24 వ తేదీ ఢిల్లీలో ధర్నా చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ఉన్నారు.

Similar News

News February 21, 2026

గౌతమ్.. నిన్ను ఎప్పటికీ మరచిపోలేను: జగన్

image

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి వర్ధంతి నేడు. ఈనేపథ్యంలో ఆయనతో తనకు ఉన్న బంధాన్ని మాజీ సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘డియర్ గౌతమ్.. మన స్నేహంతో కూడిన మధురమైన జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. నువ్వు నాకు స్నేహితుడే కాదు సోదరుడివి. నువ్వు ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతావు’ అంటూ జగన్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు.

News February 21, 2026

నెల్లూరు: దశాబ్దాల కల’వరం’..!

image

డక్కిలి(M) ఆల్తూరుపాడు బ్యాలన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తయితే వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు తాగు, సాగు నీటి కొరత నుంచి బయటపడవచ్చు. దశాబ్దాల కల కావడంతో అది తీరితే వారికి వరమే. ఈ ప్రాజెక్ట్ కింద సోమశిల- స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను 56 KM మేరా చేపట్టాల్సి ఉండగా రూ. 733.778 కోట్లను పరిపాలన ఆమోదం కోసం పంపారు. అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

News February 21, 2026

నెల్లూరు జిల్లాలో 6 మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి

image

సౌర వెలుగులతో గ్రామాలు వెలిగిపోనున్నాయి. PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన సోలార్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్లా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని లేగుంటపాడు, బిట్రగుంట, మహిమలూరు, కలివెలపాలెం, మనుబోలు, కాకుపల్లి వంటి 5 వేల మందికి పైగా జనాభా కలిగిన గ్రామాలను ఎన్నుకొన్నారు. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన గ్రామాలకు రూ. కోటి కేంద్రం మంజూరు చేస్తుంది.