News January 4, 2026
ఎంపీ వినతితో వికారాబాద్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేనా?

ధారుర్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్లో హుబ్లీ, బీజాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. కోవిడ్ సమయంలో ఈ స్టేషన్లో రైళ్ల నిలపడాన్ని ఆపేశారని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొ న్నారు. హుబ్లీ, బీజాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా చూడాలని కోరారు.
Similar News
News January 5, 2026
పిఠాపురంలో 200 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

పిఠాపురంలో రూ.200 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, ఏడు కీలక రహదారులు, తీర రక్షణ పథకం, పశువుల షేడ్లు, హెల్త్ క్లినిక్లు, పంచాయతీ భవనాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఈ పనులు ఎంతో దోహదపడతాయని అధికారులు వెల్లడించారు.
News January 5, 2026
కరీంనగర్: ఓటర్ల జాబితాలో ‘గందరగోళం’

కరీంనగర్ నగరపాలక సంస్థ ఓటర్ల జాబితా తప్పుల తడకగా తయారైంది. వార్డుల వారీగా కాకుండా పాత బూత్‌ల ప్రకారమే జాబితాను రూపొందించారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఒక డివిజన్ ఓటర్లు మరోచోట చేరారు. వెదురుగట్ట గ్రామ ఓటర్లు తీగలగుట్టపల్లి జాబితాలో ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ తప్పిదాలపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తోంది. అధికారులు ఎప్పుడు సరిచేస్తారో వేచి చూడాలి.
News January 5, 2026
ఎండోమెట్రియోసిస్ ఉంటే పిల్లలు పుట్టరా?

మహిళల్లో ఎండోమెట్రియల్ లైనింగ్ మందంగా ఉంటే నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువరోజులు కావడం, నొప్పి, స్పాటింగ్ వంటివి ఉంటాయి. దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. దీని తీవ్రతను బట్టి గర్భధారణ సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారిలో అబార్షన్, ప్రీటర్మ్ డెలివరీ వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ✍️ ఎండోమెట్రియోసిస్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.


