News April 19, 2024
ఎంపీ RRR తరుఫున సతీమణి, కొడుకు నామినేషన్

ఉండి నియోజకవర్గ MLA అభ్యర్థిగా ఎంపీ రఘురామకృష్ణరాజు తరుఫున నామినేషన్ దాఖలు చేశారు. RRR సతీమణి రమాదేవి ఉండి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ ఆదిత్యకు ఈరోజు ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమె వెంట రఘురామకృష్ణరాజు తనయుడు భరత్, తదితరులు ఉన్నారు. రఘురామకు ఎక్కడి టికెట్ కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ వీడకపోవడంతో ఆయన తన సతీమణి, కుమారుడితో నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది.
Similar News
News September 18, 2025
నూతన కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసిన రుడా ఛైర్మన్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరిని గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టరేట్‌లో గురువారం ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రుడా పరిధిలోని అంశాలను, పలు సమస్యలను ఆమెకు వివరించారు. రుడా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
News September 18, 2025
రాజమండ్రి: నూతన కలెక్టర్‌ను కలిసిన జిల్లా ఎస్పీ

తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని గురువారం రాజమండ్రి కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, శాంతి భద్రతలపై ఇరువురు చర్చించుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలిసి పనిచేస్తామని వారు పేర్కొన్నారు.
News September 18, 2025
మెగా డీఎస్సీ అభ్యర్థులకు నేడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ

మెగా డీఎస్సీ నియామక పత్రాలు జారీ ప్రక్రియ 19వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డీఈవో వాసుదేవరావు బుధవారం తెలిపారు. టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులందరూ 18వ తేదీన ఒక సహాయకునితో రాజమండ్రిలో కేటాయించిన పాఠశాలలకు రెండు పాస్ పోర్ట్ ఫోటోలు, ఆధార్ కాల్ లెటర్‌తో సాయంత్రం 4 గంటలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, బస్సుల్లో విజయవాడ పంపుతామన్నారు.