News October 30, 2024

ఎంబీఏ జనరల్ 4వ సెమిస్టర్ 95 శాతం ఉత్తీర్ణత

image

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎంబీఏ జనరల్, ఎంబీఏ టీటీఎం 1, రెండు, మూడు, నాలుగు సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్లాగ్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఎంబీఏ జనరల్ 4వ సెమిస్టర్ 200 మంది విద్యార్థులకుగాను 191 (95%) మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంజీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు.

Similar News

News October 31, 2024

రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోే డబ్బులు జమ చేయాలి: కలెక్టర్

image

ధాన్యం అమ్మిన రైతుల బ్యాంకు ఖాతాలలో రెండు రోజుల్లో డబ్బులు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం నల్గొండ సమీపంలోని ఆర్జాల బావి, ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్ల వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నదని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News October 31, 2024

ధాన్యం సేకరణలో సంపూర్ణ సహకారం అందించాలి: కలెక్టర్

image

ధాన్యం కొనుగోలు, కష్టం మిల్లింగ్ రైస్ విషయంలో జిల్లా రైస్ మిల్లర్లు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో 2024- 25 ధాన్యం సేకరణ, రైస్ మిల్లులకు కష్టం మిల్లింగ్ రైస్ కేటాయింపు, అదనపు మిల్లింగ్ ఛార్జీలపై సమావేశం నిర్వహించారు. ఈ వానాకాలం ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని కోరారు.

News October 30, 2024

సర్వేలో ఎన్యుమరేటర్ల పాత్ర కీలకం : కలెక్టర్

image

సామాజిక ,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎన్యుమరేటర్ల పాత్ర కీలకమని NLG కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం NLG మున్సిపల్ సమావేశ మందిరంలో సమగ్ర కుటుంబ సర్వే పై ఎన్యుమరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలసీల రూపకల్పనకు సమగ్ర కుటుంబ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.