News September 4, 2025

ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశాలు

image

ఏయూలో ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో రెండు సంవత్సరాల కోర్స్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సెల్ఫ్ సపోర్టు విధానంలో నిర్వహించే ఈ కోర్సులో 60 మందికి ప్రవేశం కల్పిస్తారు. రక్షణ రంగ ఉద్యోగులకు వార్షిక ఫీజుగా రూ.40 వేలు, ఇతరులకు రూ.60 వేలుగా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

Similar News

News September 7, 2025

విశాఖ జిల్లా కోర్టులో ఈ-సేవా కేంద్రం ప్రారంభం

image

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు విశాఖ జిల్లా కోర్టులో ఈ-సేవా కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. డిజిటల్ సేవల ద్వారా న్యాయం అందరికీ చేరువ కావడమే దీని లక్ష్యంగా పేర్కొన్నారు. కేసు స్థితి, విచారణ తేదీలు, వీడియో కాన్ఫెరెన్స్ సదుపాయం, ఉచిత న్యాయ సేవల మార్గనిర్దేశం వంటి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రారంభోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయమూర్తులు హాజరయ్యారు.

News September 6, 2025

విశాఖ: ‘ఈనెల 25 లోపు అందుబాటులోకి గ్లాస్ బ్రిడ్జి’

image

కైలాసగిరి పై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని ఈనెల 25వ తేదీ లోపు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని VMRDA ఛైర్మన్ గోపాల్ తెలిపారు. ఇటీవల కైలాసగిరి పై త్రిశూలం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామన్నారు. ఇప్పటికే ప్రారంభించిన పారా సైక్లింగ్ గ్లైడింగ్‌లకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. త్రిశూలం ప్రాజెక్టు రూ.5.50 కోట్లు, గ్లాస్ బ్రిడ్జి రూ.7కోట్లతో చేపట్టామన్నారు.

News September 6, 2025

రైతాంగ సమస్యలపై 9న అన్నదాత పోరు: వైసీపీ

image

వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే.రాజు ఆధ్వర్యంలో శనివారం అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించారు. యూరియా కొరత, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లుగా మార్చిందని ఆయన విమర్శించారు. ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరు నిర్వహించనున్నట్టు తెలిపారు.