News September 6, 2025
ఎం.అలమండ: పాము కాటుతో యువకుడి మృతి

దేవరాపల్లి మండలం ఎం.అలమండ గ్రామానికి చెందిన బుడ్డ శ్రీను(28) పాము కాటుకి గురై మృతి చెందాడు. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బహిర్భూమికి వెళ్లాడు. ఆ సమయంలో విషసర్పం ఎడమకాలిపై కాటేసింది. వెంటనే కె.కోటపాడు సీహెచ్సీకి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
Similar News
News September 6, 2025
ఉపాధ్యాయుల సర్దుబాటు పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. శనివారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పదోన్నతుల వల్ల ఖాళీ అయిన ఉపాధ్యాయ పోస్టులను అదే మండలం లేదా పక్క మండలంలో అందుబాటులో ఉన్న టీచర్లను సర్దుబాటు చేయాలని, ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
News September 6, 2025
తిరుపతి: పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

తమ పెద్దల నుంచి ప్రాణహాని ఉంది అంటూ ఓ జంట చిల్లకూరు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం మేరకు.. చిల్లకూరు మండలం, మర్లమిట్ట గ్రామానికి చెందిన ఓ యువకుడు, శ్రీ కాళహస్తి మండలం, తొండమనాడు గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో వివాహం చేసుకుని శనివారం చిల్లకూరు పోలీసులను ఆశ్రయించారు. అమ్మాయి తరుఫున తమకు ప్రాణహాని ఉందని, రక్షించాలని పోలీసులను వారు కోరారు.
News September 6, 2025
VZM: యూరియా పంపిణీపై కలెక్టర్ కీలక ప్రకటన

ప్రస్తుతం విజయనగరం జిల్లాలో 1,122 మెట్రిక్ టన్నుల యూరియా RSK, ప్రయివేటు వర్తకుల వద్దా సిద్ధంగా ఉందని కలెక్టర్ అంబేడ్కర్ శనివారం తెలిపారు. సోమవారం మరో 850 టన్నులు, గురువారం 1,000 టన్నులు యూరియా జిల్లాకు రానుందని పేర్కొన్నారు. ఇది కాకుండా ఈ నెలాఖరుకి మరో 3,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని వెల్లడించారు. రైతులు షాపులవద్ద గంటల తరబడి క్యూల్లో నిల్చోవాల్సిన అవసరం లేదన్నారు.