News November 26, 2025

ఎఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని (కోడ్) అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎస్పీ సునీతతో కలిసి ఆయన నోడల్ అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి, నామినేషన్ల ప్రక్రియపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు.

Similar News

News November 26, 2025

ఉమ్మడి ఖమ్మం నుంచే సీఎం పంచాయతీ ఎన్నికల శంఖారావం..!

image

సీఎం రేవంత్ రెడ్డి స్థానికసంస్థల ఎన్నికల శంఖారావాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే పూరించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబరు 2న కొత్తగూడెం పరిధి లక్ష్మిదేవిపల్లిలో ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీ ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. భద్రాద్రి రామయ్య దీవెనలతో పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలని సీఎం భావిస్తున్నారట. సీఎం సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

News November 26, 2025

హనుమాన్ చాలీసా భావం – 21

image

రామ దువారే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైఠారే ||
శ్రీరాముని సన్నిధికి ఆంజనేయస్వామి ద్వారపాలకుడిగా ఉంటాడు. ఆయన అనుమతి లేకుండా శ్రీరాముని చెంతకు ఎవరూ చేరలేరు. ఆ శ్రీరాముడు మనల్ని చల్లగా చూడాలంటే హనుమంతుడి అనుగ్రహం కూడా తప్పనిసరి. రామయ్యకు అత్యంత ప్రీతిపాత్రుడైన, శక్తిమంతుడైన భక్తుడు హనుమంతుని పూజిస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. త్వరగా మోక్షం లభిస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 26, 2025

ఫైనల్‌కు ఉమ్మడి ఖమ్మం అండర్-19 గర్ల్స్ జట్టు

image

సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న అండర్-19 గర్ల్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో నాలుగు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి పూల్ విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన సెమీఫైనల్‌లో మెదక్ జట్టుపై గెలిచిన ఖమ్మం జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ పోరులో ఖమ్మం, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.