News July 26, 2024
ఎకో టూరిజంలో కుంటాల జలపాతం, కవ్వాల్ ఫారెస్ట్

ఎకో టూరిజంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు స్పాట్లను ఎంపిక చేయగా అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ ఫారెస్ట్‌తో పాటు కుంటాల జలపాతానికి చోటుదక్కింది. కుంటాల జలపాతం వద్ద ట్రైబల్ ఎకో టూరిజం కింద రిసార్ట్ నిర్మాణం, టూరిస్టుల విడిది కోసం వసతి, ఎకో ఫ్రెండ్లీ కార్టెజ్‌లు నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ITDA PO ద్వారా రూ.3.81లక్షలతో వివిధ పనులు చేపట్టనున్నారు.
Similar News
News February 20, 2026
ఆదిలాబాద్: పది పరీక్షలకు 52 పరీక్ష కేంద్రాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 10,888 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ రాజేశ్వర్ వెల్లడించారు. వీరిలో 5,443 మంది బాలురు, 5,445 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పర్యవేక్షణ కోసం 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 13 మంది కస్టోడియన్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.
News February 19, 2026
ADB: స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన SC విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి గాను విదేశాల్లో ఉన్నత విద్యనూ అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్య నిధి పథకం ద్వారా స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా SC సంక్షేమ శాఖ అధికారిణి సునీత కుమారి పేర్కొన్నారు. ఈ – పాస్ ఆన్ లైన్‌లో మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News February 18, 2026
రాష్ట్రస్థాయి క్రీడల్లో ఆదిలాబాద్ చిన్నారుల ప్రభంజనం

రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఆటల పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ పోటీల కోసం జిల్లా నుంచి 26 మంది విద్యార్థులు హైదరాబాద్‌కు వెళ్లగా, వారు పాల్గొన్న దాదాపు అన్ని విభాగాల్లోనూ సత్తా చాటారు. వారిని కలెక్టర్ అభినందించారు.


