News January 28, 2025
ఎకో టూరిజం స్పాట్‌గా వికారాబాద్: CM

వికారాబాద్‌ను ఎకో టూరిజం స్పాట్‌గా చేస్తామని CM రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో ఎక్స్‌పీరియం పార్కు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో టూరిజం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. మల్లెలతీర్థం, కొల్లాపూర్‌లో అద్భుతమైన ప్రకృతి ఉందని, వాటినీ అభివృద్ధి చేస్తామన్నారు.
Similar News
News November 5, 2025
మరిపెడలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్

మరిపెడలో సాంఘిక సంక్షేమ గురుకులం ఆధ్వర్యంలో జోనల్ స్థాయి క్రీడా పోటీలు జరగనున్నాయి. మరిపెడలో ఈ నెల 6 నుంచి 8 వరకు 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వస్తున్నట్లు ప్రిన్సిపల్ దయాకర్ తెలిపారు. 9 రకాల ఆటలు నిర్వహించే ఈ పోటీల్లో ఖమ్మం జోన్‌కు చెందిన 11 పాఠశాల నుంచి 935 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. 6న జరిగే ప్రారంభ వేడుకల్లో అధికారులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
News November 5, 2025
చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ బాలుర జట్టు ఇదే..!

చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ బాలుర జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక సదుంలో బుధవారం జరిగింది. ధరణీధర, బాలాజీ, భరత్ కుమార్, మహేంద్ర, సుధీర్(సదుం), వెంకటేశ్, ప్రసన్నకుమార్, ప్రిన్స్ (నిండ్ర), సతీష్(పలమనేరు), హర్షవర్ధన్(ఏఎన్ కుంట), నిఖిల్(దిగువమాఘం), ప్రవీణ్ కుమార్ (చిత్తూరు), సుశీల్ (సిద్ధంపల్లె), గోకుల్(అరగొండ), ప్రవీణ్ కుమార్ నాయక్(పీలేరు) ఎంపికైనట్లు నిర్వాహకులు చెప్పారు.
News November 5, 2025
‘Money Heist’ ప్రేరణతో ₹150 కోట్ల దోపిడీ.. చివరికి..

థ్రిల్లర్ సిరీస్ ‘Money Heist’ ప్రేరణతో ₹150 కోట్లు దోచుకుంది ఢిల్లీకి చెందిన గ్యాంగ్. నిందితులు అర్పిత్(ప్రొఫెసర్), ప్రభాత్(అమాండా), అబ్బాస్(ఫ్రెడ్డీ) తమ పేర్లను సిరీస్‌లో మాదిరి మార్చుకున్నారు. SMలో పలు గ్రూపులు ఏర్పాటు చేసి స్టాక్ మార్కెట్ టిప్స్ ఇచ్చారు. తర్వాత హై రిటర్న్స్ ఇస్తామని నమ్మించి ₹కోట్లు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు 2 రాష్ట్రాల్లో దాడులు చేసి వారిని పట్టుకున్నారు.


