News January 7, 2026

ఎకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలి: కడియం

image

దేవునూరు గుట్టలు, ధర్మసాగర్ రిజర్వాయర్‌ను కలిపి ఎకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని MLA కడియం శ్రీహరి కోరారు. హనుమకొండ రివ్యూ మీటింగ్లో ఎమ్మెల్యే మాట్లాడారు. దేవునూరు గుట్టలను అనుకోని ఉన్న గ్రామాల రైతులు ఫారెస్ట్ అధికారులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను పరిష్కరించాలన్నారు.

Similar News

News February 20, 2026

B.Ed సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ B.Ed మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. కాగా ఈ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేశారు. దీనితో కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 24 నుంచి మార్చి 2వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరుగుతాయని తెలిపారు.

News February 20, 2026

తండ్రి హెల్త్ అప్డేట్స్ బయటకు రావడంపై సల్మాన్ అసంతృప్తి

image

సల్మాన్ ఖాన్ తండ్రి, రచయిత సలీమ్ ఖాన్ ఆరోగ్య <<19171270>>పరిస్థితి<<>> విషమంగానే ఉంది. 90 ఏళ్ల ఆయనకు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. అయితే సలీమ్ హెల్త్ అప్డేట్స్ బయటికి రావడంపై ఆసుపత్రి వర్గాలపై సల్మాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన కుటుంబీకులతో కలిసి హాస్పిటల్‌కు వెళ్లారు. తన తండ్రి హెల్త్ అప్డేట్స్ ఏవీ బయటికి చెప్పొద్దని, ప్రైవసీ మెయింటెన్ చేయాలని సూచించారు.

News February 20, 2026

ఉమ్మడి ప్రకాశం: కీలక సమావేశానికి రంగం సిద్ధం.!

image

ఈ నెల 22న అమరావతిలో CM చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఇన్‌ఛార్జ్‌లు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు పరిస్థితులపై సమగ్రంగా చర్చించనున్నారు. నియోజకవర్గాల్లో చేపట్టిన పనుల పురోగతిని విడివిడిగా సమీక్షిస్తూ, అభివృద్ధిలో వేగం పెంచేందుకు CM దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.