News January 4, 2025
ఎక్కడి వారు అక్కడే పనిచేయాలి: డీఎంహెచ్ఓ

వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కడ పనిచేయాల్సిన వారు అక్కడే పని చేయాలని నెల్లూరు డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డిప్యూటేషన్లపై విధులు నిర్వర్తిస్తున్న వారిని వెంటనే రిలీవ్ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. జీవో నం. 143 ద్వారా డిప్యూటేషన్‌పై ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని వెల్లడించారు.
Similar News
News January 8, 2026
నెల్లూరు: రూ.14.22 కోట్లను ప్రభుత్వం రాబట్టలేదా..?

నెల్లూరు జిల్లాలో గనుల తవ్వకాల పన్ను(సీనరేజ్) వసూళ్ల కాంట్రాక్టర్‌ను AMR సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ ప్రభుత్వానికి నెలకు రూ.14.22 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎక్కడికక్కడ AMR చెక్‌పోస్ట్‌లు పెట్టి రూ.30కోట్లకు పైగా వసూళ్లు చేస్తోందని సమాచారం. కానీ ప్రతినెలా ప్రభుత్వానికి సరిగా సీనరేజ్ కట్టడం లేదని తెలుస్తోంది. జనవరి ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉందని DD శ్రీనివాసరావు Way2Newsకు తెలిపారు.
News January 8, 2026
నెల్లూరు: పథకాలు ఉన్నా.. అందడం లేదు!

మత్స్యశాఖలో ఎన్నో పథకాలు ఉన్నాయనేది చాలామందికి తెలియదు. రాష్ట్ర పథకాలు నిలిచిపోగా.. కేంద్ర పథకాలు ఉన్నా అమలు కావడం లేదు. నెల్లూరు జిల్లాలో 25 రకాల సబ్సిడీ పథకాల కింద 10,195 యూనిట్స్ కేటాయించారు. కేవలం 359 యూనిట్లు మంజూరు కాగా.. 9,835 యూనిట్లు మిగిలిపోయాయి. పథకాలపై ప్రచారం లేకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొంది. ఈ శాఖపై త్వరలో కలెక్టర్ రివ్యూ నిర్వహించనున్నట్లు సమాచారం. ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
News January 8, 2026
సూళ్లూరుపేట: పక్షుల భూతల స్వర్గంలో ఫ్లెమింగో ఫెస్టివల్!

సూళ్లూరుపేట :ఫ్లెమింగో పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నేలపట్టు, పులికాట్‌లో సందడి చేస్తున్నాయి. పులికాట్ సరస్సును ఆహార కేంద్రంగా, నేలపట్టు చెరువును సంతానోత్పత్తి కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ జీవ వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు 2001లో అప్పటి నెల్లూరు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చొరవతో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. 2016లో పర్యాటక శాఖ రాష్ట్ర స్థాయి పండగగా గుర్తించింది.


