News March 28, 2024
ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే: CM రేవంత్ రెడ్డి

తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో గురువారం ఓటు వేసి అనంతరం కొడంగల్లోని తన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్కు 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Similar News
News November 9, 2025
నవీన్ యాదవ్ రౌడీ కాదు: CM రేవంత్

నవీన్ యాదవ్ రౌడీ కాదని CM రేవంత్ రెడ్డి అన్నారు. B.Arch చేసి, ప్రజా సేవలో ఉన్న యువకుడు నవీన్ అంటూ CM పేర్కొన్నారు. ‘తన తండ్రిని చూసి రౌడీ అన్ని ముద్ర వేస్తున్నట్లు నవీన్ యాదవ్ ఇప్పటికే చెప్పారు. పాస్పోర్టు బ్రోకర్ కొడుకు ఏం అవుతారని కూడా ఆయన నిలదీశారు. దీనిపై BRS సమాధానం చెప్పాలి. టికెట్ ఇచ్చిన అని నేను ఏం చెప్పడం లేదు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ప్రజలే తీర్పు చెబుతారు’ అని CM రేవంత్ తెలిపారు.
News November 9, 2025
HYD: తండ్రి మరణం తట్టుకోలేక యువతి సూసైడ్

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక సౌమ్య అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.బ్లాక్ నంబర్–4 అపార్ట్మెంట్స్లోని మూడో అంతస్తు నుంచి దూకిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు నిలువలేదు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 9, 2025
జూబ్లీహిల్స్లో 100 శాతం గెలుపు కాంగ్రెస్దే: CM

జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ 100 శాతం గెలుస్తుందని CM రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. BRSకు ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ఇక BJPకి డిపాజిక్ కూడా దక్కదన్నారు. ఆదివారం మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. BJPకి డిపాజిట్ రాదన్న విషయం కిషన్ రెడ్డి గుర్తించాలన్నారు. నవంబర్ 14న ఫలితాలు వచ్చాక చూద్దామంటూ CM వ్యాఖ్యానించారు. ఇక బస్తీల సమస్యలపై మంత్రులకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు.


