News November 9, 2025

ఎక్కువ మంది పెట్టుకునే పాస్‌వర్డ్స్ ఇవేనట!

image

సైబర్ నేరాలు కొత్తపుంతలు తొక్కుతున్న ఈ కాలంలోనూ కొందరు పాస్‌వర్డ్స్‌ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. 123, 1234, 1234567890, password, India@123 వంటివి ఈ ఏడాదీ పెట్టుకున్నారు. Comparitech రీసెర్చర్లు 200 కోట్ల అకౌంట్లను విశ్లేషించి ఈ ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. 123456ను 76లక్షల మంది, Adminను 19లక్షల మంది పెట్టుకున్నట్లు చెప్పారు. పాస్‌వర్డ్ <<15588875>>స్ట్రాంగ్‌గా <<>>ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News February 22, 2026

మార్నింగ్ క్యారెట్ జ్యూస్ తాగితే..

image

ఉదయం క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ‘అధిక వాటర్ పర్సంటేజ్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మలినాలను బయటికి పంపిస్తాయి. విటమిన్-B6 శక్తినిస్తుంది. విటమిన్-A స్కిన్ గ్లో పెంచుతుంది. విటమిన్-C రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. తక్కువగా ఉండే క్యాలరీలు బరువు పెరగకుండా చేస్తాయి’ అని వివరించారు.

News February 22, 2026

పువ్వుల సాగు- మంచి ధర రావాలంటే మొక్కలు ఎప్పుడు నాటాలి?

image

పువ్వుల సాగులో లాభాలు రావాలంటే పంట నాటే సమయం కీలకం. దీని కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో మొక్కలను నాటుకోవడం మేలని.. హార్టికల్చర్ నిపుణులు, పువ్వుల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతులు చెబుతున్నారు. ఇలా నాటితే జూన్ నుంచి పువ్వుల కాపు మొదలవుతుందని, జులై నుంచి ప్రారంభమయ్యే పండుగల నాటికి మంచి దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చంటున్నారు.

News February 22, 2026

భారీగా తగ్గిన క్యారెట్, బీట్‌రూట్ ధరలు

image

AP: రాష్ట్రంలో క్యారెట్, బీట్‌రూట్ ధరలు పడిపోయాయి. సాధారణంగా ఇవి కేజీకి రూ.80-100 చొప్పున విక్రయిస్తారు. అయితే రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటకలో క్యారెట్, బీట్‌రూట్ సాగు పెరగడంతో ధరలు దిగివచ్చాయి. దీంతో క్యారెట్, బీట్‌రూట్ కేజీకి రూ.30-40 చొప్పున లభ్యమవుతున్నాయి. అటు తెలంగాణలోనూ వీటి ధరలు కాస్త తగ్గి కేజీ రూ.50-70 మధ్య ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.