News March 23, 2026
ఎక్స్‌ఛేంజ్ ట్రెండ్‌లో హైదరాబాద్ టాప్

పాడైన వస్తువులను మరమ్మతు చేసుకునే సంస్కృతి క్షీణిస్తోంది. కొత్తవి కొనుగోలు చేసే ధోరణి నగరవాసుల్లో వేగంగా పెరుగుతోందని టాక్సిక్స్ లింక్ అధ్యయనం వెల్లడించింది. ఇందులో దేశంలోని ప్రధాన నగరాల్లో HYD అగ్రస్థానంలో నిలిచింది. అన్ని ఆదాయ వర్గాల్లోనూ ‘రీప్లేస్మెంట్ ట్రెండ్’ స్పష్టంగా ప్రాబల్యం సాధించినట్లు తేలింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల విషయంలో మార్పిడి అధికంగా ఉన్నట్లు నిర్ధారించింది.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.