News February 28, 2025
ఎక్స్‌పో 2025లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

మహిళా వ్యవస్థాపక స్ఫూర్తిని పురస్కరించుకుని ఉమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్(WISE&B2B) ఎక్స్‌పో 2025లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చెందడానికి, ఆర్థిక వృద్ధికి దారితీసే సమ్మిళిత పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి తెలంగాణ కట్టుబడి ఉందన్నారు.
Similar News
News February 28, 2025
70 సైకిళ్లు సిద్ధం.. తీసుకెళ్లేందుకు మీరు సిద్ధమా!

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించిన వారికి 70 సైకిళ్లు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. పదో తరగతి తుది ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి సైకిళ్లను పొందాలన్నారు. 192 ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదో తరగతి చదువుతున్న 6074 మంది విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదవాలన్నారు.
News February 28, 2025
పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా అనుమతులు: జేసీ

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా అనుమతులను మంజూరు చేయాలని జేసీ కార్తీక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి, పిఎంఈజిపి రుణాల మంజూరు, క్లస్టర్ డెవలప్‌మెంటు ప్రోగ్రాం అంశాలను జిల్లా పరిశ్రమల శాఖ జిఎం ప్రసాద్ వివరించారు.
News February 28, 2025
మంత్రి తుమ్మల అనుచరుడు గాదె సత్యం మృతి

సత్తుపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు గాదె సత్యనారాయణ (76) ఊపిరితిత్తుల వ్యాధితో శుక్రవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడిగా మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాలలో సేవలందించారు. ఆయన మృతిపట్ల మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే డా. రాగమయి దయానంద్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆయా పార్టీల నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.