News January 15, 2026

ఎగుమతుల్లో వృద్ధి.. అమెరికాకు అధికం!

image

TG: ఎగుమతుల్లో రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించింది. 2023లో రూ.95వేల కోట్లుగా ఉన్న ఎగుమతులు 2024-2025 నాటికి రూ.1.1 లక్షల కోట్లకు చేరాయి. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం దేశంలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. తయారీ రంగంలో ఎగుమతుల్లో 35.2% కేవలం ఫార్మా ఉత్పత్తులే ఉన్నాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎగుమతులు USకు(28.17 శాతం) జరుగుతున్నాయి. అటు ఈ అంశంలో దేశంలోనే గుజరాత్ టాప్‌ ప్లేస్‌లో ఉంది.

Similar News

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘త్రినేత్ర’’

image

శివుడి కుడి కన్ను సూర్యుడిని, ఎడమ కన్ను చంద్రుడిని సూచిస్తుంది. ‘జ్ఞాన నేత్రం’ అని పిలిచే మూడో కన్ను అగ్నిని సూచిస్తుంది. సాధారణ కళ్లు భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూస్తాయి. కానీ, మూడో కన్ను అంతరాత్మను, సత్యాన్ని దర్శిస్తుంది. అజ్ఞానాన్ని దహించివేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంతటి శక్తి ఆ నేత్రమయం. అందుకే ఆయనను ముక్కంటి/త్రినేత్రుడు అంటారు. కామదహనంలో ఆయన తన మూడో కంటితోనే మన్మథుడిని భస్మం చేశాడు.

News February 12, 2026

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>శ్యామ్<<>> ప్రసాద్ ముఖర్జీ పోర్టు హల్దియా డాక్ కాంప్లెక్స్‌లో 6 రైల్వే స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్, ఐటీఐ, ట్రేడ్ అప్రెంటిస్, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 10వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.46,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://smp.smportkolkata.in/

News February 12, 2026

T20 WC: నేటి మ్యాచులు

image

టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి.
✮ ఫస్ట్ మ్యాచ్: శ్రీలంకvsఒమన్(11am)
✮ సెకండ్ మ్యాచ్: నేపాల్vsఇటలీ(3pm)
✮ మూడో మ్యాచ్: ఇండియాvsనమీబియా(7pm)
✮ ఈ మ్యాచులన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు జియో హాట్‌స్టార్‌లో Live చూడవచ్చు.