News March 19, 2025

ఎగుమతుల పెంపునకు కృషి: మంత్రి కొండపల్లి 

image

విశాఖలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ సాధికారత సదస్సులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. MSME రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. MSMEలు రాష్ట్రంలో ఉపాధి పెంపుదల,ఆర్థిక వృద్ధికి మూలస్తంభాలన్నారు. కేంద్ర ప్రభుత్వ Viksit Bharat 2047 డాక్యుమెంట్ రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన వ్యూహాలను రూపొందిస్తున్నామన్నారు.

Similar News

News March 19, 2025

స్లాట్ల ప్ర‌కారం ద‌ర్శ‌నాలకు అనుమ‌తించాలి: కలెక్టర్

image

ఏప్రిల్ 30న సింహాచలంలో జరిగే చంద‌నోత్స‌వంకు ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్లాట్ల ప్ర‌కారం ద‌ర్శ‌నాలకు అనుమ‌తించాల‌ని, భ‌క్తుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. క్యూలైన్ల‌లో విరివిగా తాగునీటి కేంద్రాల‌ను, మ‌జ్జిగ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని ఈఓను ఆదేశించారు.

News March 19, 2025

విశాఖలో ఈనెల 24, 30న ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ

image

విశాఖలో మార్చి 24,30 తేదీలలో జరిగే IPL మ్యాచ్‌ల నిర్వహణపై CP శంఖబ్రత బాగ్చీ బుధవారం సమీక్షించారు. మ్యాచ్ జరిగే రోజుల్లో విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని CP తెలిపారు. మ్యాచ్‌ రోజు శ్రీకాకుళం, VZM వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు ఆనందపురం, పెందుర్తి, NAD మీదుగా నగరంలోకి రావాలన్నారు. చిన్న వాహనాలు మారికవలస(లేదా) మిథులాపురి కాలనీ, బీచ్ రోడ్డు, జోడిగుడ్లపాలెం మీదుగా నగరంలోకి వెళ్ళాలని సూచించారు. >Share it

News March 19, 2025

విశాఖలో కానరాని చలివేంద్రాలు..! 

image

విశాఖనగరంలో ఎండలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలంటే ఎక్కడ వడదెబ్బ తగులుతుందని భయపడుతున్నారు. మనిషి నిరసించి పడిపోతే వెంటనే నీరు అవసరం. గతంలో జీవీఎంసీ సహా పలు స్వచ్ఛందసంస్థలు ప్రతివార్డులో చలివేంద్రాల్లో మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేసేవి. ఇప్పుడు ఆరిలోవ నుంచి మద్దిలపాలెం వరకు ఎక్కడ చుసిన ఒక్క చలివేంద్రం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు.

error: Content is protected !!