News April 13, 2025
ఎగ్జామ్ ఫెయిల్.. విద్యార్థి సూసైడ్

ఇంటర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చోటు చోసుకుంది. చింతారెడ్డిపాళెంకు చెందిన ఓ విద్యార్థి నగరంలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం విడుదలైన ఫలితాలలో ఆ విద్యార్థి ఓ సబ్జెక్ట్ తప్పాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకున్నాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
Similar News
News April 14, 2025
నెల్లూరు: ప్రేయసితో గొడవ.. ప్రియుడి ఆత్మహత్య

ప్రేమలో వచ్చిన గొడవలతో ఓ యువకుడు చనిపోయాడు. నెల్లూరులోని మనుమసిద్ధినగర్‌కు చెందిన రమణమ్మ, చిన్నయ్యల చిన్న కుమారుడు పోలయ్య(25) బంగారు పనిచేస్తుంటాడు. ఈక్రమంలో స్థానికంగా ఉన్న ఓ యువతిని ప్రేమించాడు. ఇటీవల వీరి మధ్య గొడవలు వచ్చాయి. మూడు రోజులుగా పోలయ్య ఎవరితోనూ మాట్లాడటం లేదు. కుటుంబ సభ్యులంతా సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పోలయ్య బెడ్ రూములోకి వెళ్లి ఉరేసుకున్నాడు.
News April 13, 2025
నెల్లూరు జిల్లాకు మూడవ స్థానం

ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యానంలో బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు. 12, 13వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాకు మొదటి, పశ్చిమగోదావరి జిల్లాకు రెండవ, నెల్లూరు జిల్లాకు మూడవ స్థానం వచ్చింది. రూ.5000 బహుమతి అందుకున్నారు. ఆ సంస్థ అధ్యక్షుడు ఓబులం ప్రసాద్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News April 13, 2025
రూ.2.7 కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే

నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బొమ్మ నుంచి డైకాస్ రోడ్డు వరకు రూ.2.7 కోట్లతో సెంటర్ లైటింగ్, డివైడర్, ఫుట్ పాత్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గాంధీనగర్ రోడ్డును ఆదివారం పరిశీలించారు. గాంధీనగర్ రోడ్డుకు మహర్దశ పట్టిందని, త్వరలోనే అత్యంత సుందరంగా నిర్మిస్తామని ఆయన తెలిపారు.