News November 12, 2025
ఎగ్జిట్ పోల్స్: 2015, 2020లో ఏం జరిగింది?

బిహార్ ప్రజల నాడిని ఎగ్జిట్ పోల్స్ పట్టలేకపోతున్నాయని 2015, 2020 ఎన్నికల ఫలితాల్లో తేలింది. 2015లో మహాఘట్‌బంధన్(JDU+RJD+INC), NDAకు గట్టి పోటీ ఉంటుందని 6 మేజర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే MGB 178 సీట్లు గెలవగా, NDA 58 సీట్లకు పరిమితమైంది. 2020లో MGB(INC+RJD)దే గెలుపని 11 ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే JDUతో కూడిన NDA 125 సీట్లతో అధికారంలోకి వచ్చింది.
* మరి ఈసారి తీర్పు ఎలా వస్తుందో?
Similar News
News November 12, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 12, 2025
మోదీ తల్లి పాత్రలో రవీనా టాండన్!

ఉన్ని కృష్ణన్ ప్రధాన పాత్రలో ప్రధాని మోదీ బయోపిక్ ‘మావందే’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన తల్లి హీరాబెన్ పాత్రలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ నటిస్తున్నారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. రవీనా KGF 1, 2లో నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో తదితర చిత్రాల్లోనూ ఆమె నటించారు.
News November 12, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 12, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.19 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


