News March 1, 2026

ఎగ్జిమ్ బ్యాంక్‌లో 20 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in

Similar News

News March 1, 2026

విశ్వసనీయతతోనే మధ్యవర్తిత్వం సఫలం: CJI

image

AP: మధ్యవర్తిత్వం వహించేవారిపై ఇరుపార్టీలు విశ్వాసం కలిగి ఉన్నప్పుడే వారి మధ్య ఏర్పడ్డ న్యాయ వివాదాలు త్వరగా పరిష్కారమవుతాయని CJI జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. అమరావతిలో ‘మధ్యవర్తిత్వం’పై జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్బిట్రేటర్ల నియామకమూ అలాగే ఉండాలన్నారు. సమస్య పరిష్కారానికి పార్టీల మధ్య జరిగిన ఒప్పందాలను వేగంగా, సక్రమంగా అమలు చేసేలా యంత్రాంగమూ ఉండాలని పేర్కొన్నారు.

News March 1, 2026

పెరిగిన జీఎస్టీ వసూళ్లు

image

AP: రాష్ట్రంలో గూడ్స్, సర్వీస్ ట్యాక్స్ వసూలు గతంలో కన్నా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం GST-2.0లో పలు వస్తువులపై ట్యాక్సుల భారాన్ని తగ్గించినా రాబడిలో పురోగతి నమోదైంది. 2026 FEBలో నెట్ వసూలు ₹3061 CR కాగా గ్రాస్ ₹3562 CRవసూలు అయ్యింది. అదే 2025 FEBలో నెట్ ₹2902CR కాగా గ్రాస్ ₹3569CRగా ఉంది. సెస్‌తో సంబంధం లేకుండా గ్రాస్ వసూళ్లు తగ్గినా నెట్ వసూళ్లలో మాత్రం ₹150 CR పెరుగుదల కనిపించింది.

News March 1, 2026

ఇరాన్ దాడుల్లో ముగ్గురు మృతి.. 58 మందికి గాయాలు: UAE

image

ఇరాన్ తమ దేశంపై చేసిన దాడుల్లో ముగ్గురు మరణించగా, 58 మంది గాయపడ్డారని UAE వెల్లడించింది. మృతులు పాక్, నేపాల్, బంగ్లాకు చెందిన వారు అని, గాయపడ్డ వారిలో భారత్‌తో పాటు మరో 14 దేశాల వారు ఉన్నారంది. 541 ఇరానియన్ డ్రోన్లు, 165 బాలిస్టిక్ మిస్సైల్స్, 2 క్రూయిజ్ క్షిపణులను ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఈరోజు ఉదయం 20 బాలిస్టిక్ మిస్సైళ్లను ధ్వంసం చేశామని, 8 సముద్రంలో పడ్డాయని పేర్కొంది.