News October 2, 2025

ఎచెర్ల: డా. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో స్పాట్ అడ్మిషన్స్

image

ఎచ్చెర్లలోని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో అక్టోబర్ 3, 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ బి. అడ్డయ్య బుధవారం తెలిపారు. అర్హత ఉన్న వారు ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి నేరుగా ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని కోరారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు క్యాంపస్‌లో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వివరించారు.

Similar News

News October 2, 2025

గాంధీ శ్రీకాకుళంలో అడుగు పెట్టింది అప్పుడే!

image

తెల్లదొరలను ఎదిరించే దిశగా ప్రజలకు స్ఫూర్తినిచ్చేందుకుగాను శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని దూసి రైల్వే స్టేషన్లలో మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ అడుగుపెట్టారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా రైలులో ప్రయాణించి జిల్లాకు చేరుకున్నారు. ఈ రైల్వే స్టేషన్లో సుమారు 15 నిమిషాల పాటు తెల్లదొరలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. మహాత్మా గాంధీకి సంబంధించిన ఆనాటి గుర్తులు ఇప్పటికీ ఆ స్టేషన్లో ఉన్నాయి.

News October 2, 2025

SKLM జిల్లాలో 59 గ్రామాలకు వరద ముంపు: కలెక్టర్

image

వంశధార నాగావళి నదులతో పాటు 59 గ్రామాలకు అక్టోబర్ 3న వరద ముప్పు సంభవించనుందని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం శ్రీకాకుళం, కొత్తూరు, పోలాకి, గార, జలుమూరు తదితల మండలాలలోని 48 గ్రామాలకు వరద ముంపు ఉండే అవకాశం ఉందన్నారు. తోటపల్లి నారాయణపురం జలవనరుల్లో వరదల వలన ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల మండలాల్లోని 11 గ్రామాలకు వరద ముప్పు ఉండొచ్చన్నారు.

News October 1, 2025

GST తగ్గింపుపై ప్రజలకు అవగాహన కలిగించాలి: కలెక్టర్

image

ప్రభుత్వం తగ్గించిన GSTపై ప్రజలకు అవగాహన కలిగించాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, GST అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీడీవోలు వీటిపై దృష్టి సారించి అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పరిశ్రమలు, వాణిజ్య పన్నులు, చేనేత విద్యుత్తు శాఖ అధికారులు దీనిపై శ్రద్ధ తీసుకోవాలన్నారు.