News February 7, 2026
ఎచ్చెర్ల: ఈ కోర్సులకు ఎందుకు డిమాండ్..?

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులకు గత కొన్నేళ్లుగా శత శాతం ప్రవేశాలు జరుగుతున్నాయి. సైన్స్ విభాగంలోని కోర్సులకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎనలైటికల్ కెమిస్ట్రీ. బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ. కెమికల్, ఫార్మా పరిశ్రమల్లో పుష్కలమైన ఉపాధి అవకాశాలు ఉండటం, పరిశోధనా సంస్థల్లో ఉద్యోగాలకు ఈ కోర్సులు మార్గం చూపడమేనని విద్యార్థులు చెబుతున్నారు.
Similar News
News February 15, 2026
పలాస కళాకారుడి అద్భుతం.. !

మహాశివరాత్రి పురస్కరించుకొని పలాసకు చెందిన సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేశ్ ఆచారి తన అద్భుత కళాఖండంతో భక్తిని చాటుకున్నారు. పెన్సిల్ మొనపై శివలింగం, ఓంకారాన్ని అత్యంత సుందరంగా చెక్కి అందరినీ అబ్బురపరిచారు. సుమారు 5 గంటల శ్రమతో రూపొందించిన ఈ సూక్ష్మ శిల్పం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ రథసప్తమి లోగో, అతిచిన్న ప్రపంచ కప్ వంటి ఆకృతులతో రమేశ్ తన ప్రతిభను నిరూపించుకున్నారు.
News February 14, 2026
మూడు పద్దులు.. మూడు రంగులు

గ్రే, బ్రౌన్, బ్లూ.. ఈ రంగులు ఏపీ బడ్జెట్ వేళ తారస పడుతున్నాయి. ఈ రంగుల బ్యాగుల్లో బడ్జెట్ ప్రతులను ఉంచి అసెంబ్లీకి తీసుకొస్తున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూజ చేసిన తర్వాత వాటిని కేబినెట్‌లో ఆమోదించే నిమిత్తం సీఎం చంద్రబాబు, dy.సీఎం పవన్‌కు అందజేశారు. ప్రభుత్వం కొలువైన తర్వాత తొలుత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు గ్రే కలర్ బ్యాగు, తర్వాత బ్రౌన్, ఇవాళ బడ్జెట్ ప్రతులను బ్లూ కలర్ బ్యాగులో తెచ్చారు.
News February 14, 2026
సిక్కోలు ‘సిద్ధమైంది’

మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీకాకుళం జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. జిల్లాలోని శ్రీముఖలింగం(ముఖలింగేశ్వర స్వామి), శ్రీకాకుళం(ఉమారుద్ర కోటేశ్వరస్వామి),రావివలస(ఎండల మల్లికార్జునస్వామి), పలాస(స్వయంభూ లింగేశ్వరస్వామి), పాతపట్నం(నీలకంటేశ్వర స్వామి) ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ ఏర్పడనుంది. దీంతో ఆయా ఆలయాల వద్ద భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


