News February 27, 2025
ఎచ్చెర్ల : ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

విజయనగరంలో ఎచ్చెర్లకు చెందిన విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేశ్ స్థానిక బొడ్డువారి జంక్షన్‌లో ఫ్రెండ్స్‌తో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్నయ్య గణేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
Similar News
News December 18, 2025
శ్రీకాకుళం: ట్రక్ షీట్ల జారీపై జేసీ సూచనలు

ధాన్యం కొనుగోలులో భాగంగా రైతు సేవా కేంద్రాల్లో జారీ చేస్తున్న ట్రక్ షీట్లపై శ్రీకాకుళం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం కీలక సూచనలు చేశారు. రాత్రి 7 నుంచి ఉదయం 5 లోపు ట్రక్ షీట్లను జారీ చేయొద్దని సిబ్బందికి సూచించారు. మెలియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం RSK పరిధిలో బుధవారం వేకువజామున 3 గంటలకు 10 ట్రక్ షీట్లు ఇవ్వడంపై కోసమాల, నందిగం, సోంపేట PACS పరిధిలో నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించారు.
News December 18, 2025
SKLM: సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు..!

సంక్రాతి పండగకు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అధనంగా 16 ప్రత్యేక రైళ్లను నడవనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం శ్రీకాకుళంలో వెల్లడించారు. జనవరి 9 నుంచి 19 మధ్య ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక రైళ్ల కేటాయింపు విషయంలో ఇది వరకే ఉన్నతాధికారులకు స్పష్టమైన సూచనలు చేసినట్టు తెలిపారు.
News December 18, 2025
డా.బీఆర్. ఏయూను సందర్శించిన విద్యామండలి ఛైర్మన్

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.మధుమూర్తి బుధవారం ఎచ్చెర్లలోని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీను సందర్శించారు. ఎన్టీఆర్ ప్రధాన పరిపాలన భవనంను, సైన్స్ కళాశాలలను పరిశీలించారు. నూతన పరిపాలనా భవనంలోని సమావేశ మందిరాలు, ఇతర కార్యాలయాలు, వసతలు, సౌకర్యాలు చూసి ఈ భవనం రాజమందిరాన్ని తలపిస్తుందని ఈ సందర్శంగా ప్రశంసించారు. వీసి రజని ఆయన్ను సత్కరించారు.


