News May 27, 2024

ఎచ్చెర్ల: జూన్ 3 వరకు పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ

image

పాలిటెక్నిక్‌ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియను జూన్ 3 వరకు నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ రాష్ట్ర డైరెక్టర్ నాగరాణి తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమవ్వగా ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శ్రీకాకుళం మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్, టెక్కలి, ఆమదాలవలస, సీతంపేట పాలిటెక్నిక్ కళాశాలల్లో 780 సీట్లు ఉన్నాయన్నారు.

Similar News

News November 10, 2025

బూర్జ: ‘గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

image

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ నాయుడు అన్నారు. ఆదివారం బూర్జ మండలం పెద్దపేట పంచాయతీ కొత్త ఊరు గ్రామంలో రూ.13.40 లక్షలతో నిర్మించనున్న మంచినీటి ట్యాంక్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ట్యాంక్ ద్వారా గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కానుందని అన్నారు.

News November 9, 2025

ఎండల మల్లన్నను దర్శించుకున్న ఎస్పీ

image

టెక్కలి మండలం రావివలస శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామివారిని ఆదివారం సాయంత్రం ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ గురునాథ రావు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. సోమవారం కార్తీకమాసం ఉత్సవం సందర్భంగా భద్రత చర్యలు పటిష్ఠంగా చేపట్టాలని అధికారులకు ఎస్పీ సూచించారు.

News November 9, 2025

SKLM: ‘ఈనెల 11న జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు’

image

జాతీయ విద్య దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం కలెక్టర్ సమావేశ మందిరంలో ఈనెల 11న నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి, ‘భారత రత్న’ జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతిని పురస్కరించుకుని జరపనున్న కార్యక్రమంలో అధికారులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.