News October 30, 2024

ఎచ్చెర్ల. డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను నేడు విడుదల చేశారు. ఈ పరీక్ష ఫీజులను ఎటువంటి అపరాధ రుసుం లేకుండా నవంబరు 11వ తేదీ వరకు చెల్లించవచ్చని యూనివర్సిటీ డీన్ తెలిపారు. అదేవిధంగా తెలిపారు. సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు నవంబర్ 18 నుంచి 23వ నుంచి వరకు, సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 28 నుంచి జరుగుతాయని నుంచి తెలిపారు.

Similar News

News March 3, 2026

జర్మనీ వెళ్తూ దోహా ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న సిక్కోలు వాసి

image

శ్రీకాకుళం మండలం సింగుపురానికి చెందిన పుట్రేవు వెంకట సత్య గౌతమ్ ఖతర్‌లోని దోహా ఎయిర్ పోర్టులో చిక్కుకున్నాడు. ఇతను బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానని, కంపెనీ ఆదేశాల మేరకు జర్మనీ ఫ్లైట్లో వెళ్తుండగా యుద్ధం వాతావరణం నెలకొనడంతో దోహా ఎయిర్ పోర్టులో విమానాన్ని నిలిపివేశారు. దీంతో ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆయన కుటుంబీకులకు తెలిపాడు.

News March 3, 2026

సిక్కోలు: మరి కాసేపట్లో క్లోజ్

image

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మూతపడుతున్నాయి. ఈ విషయాన్ని ఆయా ఆలయాల ప్రధాన అర్చకులు తెలిపారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మూత పడుతున్న ప్రముఖ దేవాలయాల జాబితాలో అరసవల్లి సూర్య దేవాలయం, శ్రీకూర్మనాథ ఆలయం, నారాయణ తిరుమల, ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, శ్రీముఖలింగం తదితర దేవాలయాలు ఉన్నాయి. గ్రహణ త్యాగం అనంతరం ఆలయ సంప్రోక్షణ, భక్తులకు దర్శనాలు ఉంటాయన్నారు.

News March 3, 2026

బాణసంచా పేలి 21 మంది మృతి.. శ్రీకాకుళం కలెక్టర్ సీరియస్

image

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జిల్లాలో బాణసంచా తయారీ నిల్వ విక్రయ కేంద్రాల వద్ద అగ్నిప్రమాద నివారణ చర్యలను అత్యంత కట్టుదిట్టం చేయాలన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద పేలుడుతో 21 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.