News March 13, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను బుధవారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. అలాగే రేపటి నుంచి రీవాల్యుయేషన్ కోసం నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Similar News

News March 13, 2025

పాతపట్నం: వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే మృతి

image

పాతపట్నం నుంచి టెక్కలి వెళ్లే రహదారి మార్గంలోని ద్వారకాపురం గ్రామం వద్ద బుధవారం రాత్రి రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పాతపట్నం మండలం, లాబర గ్రామానికి చెందిన సనపల మధు(22) మృతి చెందాడు. మృతుడి బావ మండల శివకు గాయాలయ్యాయి. సారవకోట మండలం జమ్మి చక్రం గ్రామానికి చెందిన మరో వ్యక్తి పంతులు గోపి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడికి ఏప్రిల్ 16 న పెళ్లి నిశ్చయమైంది.

News March 13, 2025

శ్రీకాకుళం: నేడు ఈ మండలాలకు ఆరంజ్ అలర్ట్ 

image

శ్రీకాకుళం జిల్లాలో గురువారం కింది మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ప్రజలు వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఈ మేరకు తమ అధికారిక ‘X’ ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.*పోలాకి 37.6*నరసన్నపేట 37.8 *జి.సిగడం 40.6*ఎచ్చెర్ల 37.6* శ్రీకాకుళం 38*లావేరు 38.4 *పోలాకి 37.6*పొందూరు 39.6

News March 13, 2025

SKLM: ప్రశాంత వాతావరణంలో పది పరీక్షలు జరగాలి

image

మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఏపీ CS కె.విజయానంద్ కలెక్టర్‌ను ఆదేశించారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్చువల్‌గా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరయ్యారు. 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నిర్వహించాలన్నారు.

error: Content is protected !!