News February 4, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

డాక్టర్ బీఆర్‌.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ 2015, 2016, 2017, 2018, 2019 ఎడ్మిట్ విద్యార్థుల మొదటి, మూడో సెమిస్టర్ షెడ్యూల్‌ను యూనివర్సిటీ డీన్ మంగళవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ ఫిబ్రవరి 17 నుంచి 28వ తేదీ వరకు, 3వ సెమిస్టర్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి 15వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయన్నారు.

Similar News

News February 26, 2026

శ్రీకాకుళం జిల్లాకు కొత్త ఆఫీసర్

image

శ్రీకాకుళం జిల్లా పంచాయతీ అధికారిగా కె. గోపి బాలను ప్రభుత్వం నియమించింది. బుధవారం రాత్రి ప్రస్తుతం డీపీవోగా పనిచేస్తున్న భారతి సౌజన్యను బదిలీ చేశారు. గోపి బాల శ్రీకాకుళం డివిజనల్ పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తుండగా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.

News February 26, 2026

డయేరియా.. శ్రీకాకుళానికి రూ.118 కోట్లు

image

శ్రీకాకుళం నగరంలో తాగునీరు, డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి పనుల కోసం రూ.118 కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి నారాయణ బుధవారం వెల్లడించారు. దమ్మలవీధి, మొండేటి వీధి, కండ్రవీధి, ఎచ్చెర్ల వీధి ప్రాంతాల్లో ప్రబలిన డయేరియా అదుపులోకి వచ్చిందన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.

News February 25, 2026

శ్రీకాకుళం: రెండు వారాల వ్యవధిలో ఇద్దరు కమిషనర్లు అవుట్..!

image

శ్రీకాకుళం నగరపాలక సంస్థ పాలనా యంత్రాంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు వారాల వ్యవధిలో ఇద్దరు కమిషనర్లపై వేటు పడింది. ఒకరు బదిలీ కాగా.. మరొకరిపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో నగర పాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన దుర్గా ప్రసాద్ రెండు వారాల కిందట ఆకస్మికంగా బదిలీపై వెళ్లారు. ప్రస్తుత కమిషనర్ కూర్మారావు వచ్చి 2 వారాలు గడవక ముందే డయేరియా నేపథ్యంలో సస్పెన్షన్ ఎదుర్కొన్నారు.