News March 21, 2024

ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆమె ఐదుసార్లు ఎమ్మెల్యే?

image

ఎచ్చెర్ల నియోజకవర్గంలో 17 సార్లు ఎన్నికలు జరిగాయి. నేటి రోజుల్లో హ్యాట్రిక్ కొట్టడమే గగనంగా మారింది. అలాంటిది ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కె.ప్రతిభా భారతి టీడీపీ తరఫున 1983 నుంచి 2004 వరకు పోటీ చేసి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించింది. పోటీ చేసిన ప్రతిసారి 10 వేలకుపైగానే మెజార్టీతో గెలుపొందారు. ఆమె ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొదటి మహిళ స్పీకర్ గా పనిచేశారు.

Similar News

News July 3, 2024

శ్రీకాకుళంలో 3రోజులు వర్షాలు

image

ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో రానున్న 3 రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనెల 3, 4, 5 తేదీల్లో జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. రేపు మబ్బులతో కూడి అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

News July 3, 2024

శ్రీకాకుళం: జాతీయస్థాయి అవార్డులకు ఆహ్వానం

image

జాతీయస్థాయి ఉపాధ్యాయుల అవార్డ్స్-2024 సంబంధించి అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఇందులో దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. అర్హత గల ఉపాధ్యాయులు ఈనెల 15వ తేదీలోగా http://nationalawardstoteacherseducation.gov.in వెబ్‌సైట్లో అప్లై చేసుకోవాలని సూచించారు.

News July 3, 2024

పెన్షన్ల పంపిణీలో శ్రీకాకుళం జిల్లా టాప్

image

పింఛను పంపిణీ లబ్ధిదారుల సంఖ్యలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే టాప్‌లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 3,19,147 ఉండగా ఇప్పటి వరకు 99.21% లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. దీని తర్వాత విజయనగరం రెండో స్థానంలో ఉంది. కాగా ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో 3,16,528 మందికి పెన్షన్ పంపిణీ చేశారని అధికారులు తెలిపారు.