News March 27, 2024
ఎచ్చెర్ల నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఈశ్వరరావు

ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ-జనసేన-టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నడుకుదిటి ఈశ్వరరావును (ఎన్ఈఆర్) బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ నడుకుదిటిపాలెంకు చెందిన ఈయన తొలిసారిగా 2014లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల తరువాత.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పట్ల ఆకర్షితుడైన ఎన్ఈఆర్ బీజేపీలో చేరారు. ఈయన ప్రస్తుతం విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.
Similar News
News April 5, 2026
శ్రీకాకుళం: శిక్షణతో ఉద్యోగం పొందండి.. 18-28 ఏళ్ల వారికే

శ్రీకాకుళం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను ఇస్తామని విశాఖలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ (SDI) సీఈవో విజయ్ కుమార్ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. టెన్త్- బిటెక్ చదివి 18-28 ఏళ్ల మధ్య ఉన్న యువతకు ఉచిత భోజనం, వసతితో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. వెల్డింగ్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ విభాగాల్లో విశాఖలో శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు 79893 13189 కాల్ చేయాలని కోరారు
News April 5, 2026
శ్రీకాకుళం పోలీస్ కార్యాలయంలో జగ్జీవన్ జయంతి

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి డీఎస్పీ వివేకానంద పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, భారత దేశ ఉప ప్రధాని అని అన్నారు. దళిత వర్గాల ఆశాజ్యోతి అని, వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు.
News April 5, 2026
నరసన్నపేట: కల్తీ ఆహారంపై కనికరమేల..?

నరసన్నపేటలో నాణ్యతలేని ఆహార విక్రయాలు భారీగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మిల్క్ షేక్, హోటల్స్, స్వీట్ స్టాల్స్, రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ అమ్మకాలలో నాణ్యతా ప్రమాణాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల సింగపురంలో జరిగిన కల్తీ బాదంపాలు ఘటన అందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.


