News August 22, 2025
ఎచ్చెర్ల: నేడు పోలీసులకు ఫైరింగ్ ప్రాక్టీస్

ఎచ్చెర్లలోని చిన్నరావుపల్లి వద్ద పోలీస్ ఫైరింగ్ గ్రౌండ్లో శుక్రవారం జిల్లా పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేయనున్నట్లు రిజర్వ్ ఇన్స్పెక్టర్ శంకర్ ప్రసాద్ తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్షిక శిక్షణలో భాగంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరవుతారన్నారు.
Similar News
News August 22, 2025
శ్రీకాకుళంలో స్పెషల్స్ కోర్టు ఏర్పాటుకు ఆమోదం

శ్రీకాకుళంలో స్పెషల్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గురువారం విజయవాడలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భారత ఉన్నత న్యాయస్థానం క్రిమినల్ రిట్ పిటీషన్ నెంబరు 511 ఆఫ్ 2024లో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోర్టు ఏర్పాటు చేయనున్నారు. మావోయిస్ట్ కేశవరావుపై విచారణ చేస్తున్న16 కేసులపై 7 వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టుగా నియమించే ప్రతిపాదనకు ఆమోదం దక్కింది.
News August 22, 2025
శ్రీకాకుళం SC యువతకు హెవీ వాహన డ్రైవింగ్ శిక్షణ

జిల్లాకు చెందిన షెడ్యుల్డ్ కులాల యువతీ–యువకులకు భారీ వాహన డ్రైవింగ్ శిక్షణ కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు చెందిన 10 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థుల వయస్సు 20-40 ఏళ్లతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. వివరాలకు జిల్లా షెడ్యుల్డ్ కులాల సేవా సహకార సంఘం కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.