News November 27, 2024
ఎచ్చెర్ల: పీజీ కోర్సులో ఈనెల 29న స్పాట్ అడ్మిషన్

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మిగులు సీట్లకు ఈ నెల 29న స్పాట్ అడ్మిషన్ నిర్వహించినట్లు రిజిస్ట్రార్ పి.సుజాత బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు ఉదయం.10 నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఈ ప్రవేశాలు జరగనున్నాయని తెలిపారు. ఏపీ పీజీ సెట్ -2024 అర్హతతో సంబంధం లేకుండా డిగ్రీ ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
Similar News
News February 13, 2026
రేపు శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవు లేదు: DEO

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేయనున్నాయని DEO రవిబాబు శుక్రవారం తెలిపారు. వాస్తవానికి రేపు రెండో శనివారం అయినప్పటికీ గత ఏడాది తుఫాన్ సందర్భంగా సెలవుల అనంతరం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు పాఠశాలలకు పనిదినాలు ఉండనున్నాయని తెలిపారు. పాఠశాలల పనిదినాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రేపు సెలవు రద్దు చేయడం జరిగిందన్నారు.
News February 13, 2026
శ్రీకాకుళం: నేడు ప్రపంచ రేడియో దినోత్సవం

ఆకాశవాణి.. అంటూ గగనతలం నుంచి సాగిన అదృశ్యవాణి ఒక తరానికి తీరని జ్ఞాపకం. టీవీలు, సెల్ ఫోన్లు రాకముందు రేడియో ఒక అద్భుతమైన స్నేహితుడు. పాటలు, కథలు, న్యూస్, వినోదం ఇలా ఎన్నో రకాల సేవలు అందించే ఈ రేడియో నేటి తరానికి తెలియదు. సమాచార విప్లవం తర్వాత కూడా ఎఫ్.ఎమ్ అంటూ సందడి చేసింది. నేడు ప్రపంచ రేడియో దినోత్సవం.
News February 13, 2026
మందస: రాజవంశీయుడు కన్నుమూత

మందస రాజవంశీయులు కేసరి సింగ్ దేవ్ (79) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లోని ఖార్వేలా నగర్‌లో స్వగృహంలో కన్నుమూశారు. కేసరి సింగ్ దేవ్ గతంలో టెరిటోరియల్ ఆర్మీలో అధికారిగా పనిచేశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సైనిక లాంఛనాలతో నిర్వహించారు. ఈయన మృతితో మందసలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ సంస్థానానికి చివరి రాజు అయిన రాజమణి రాజ్ దేవ్ ద్వితీయ కుమారుడే కేసరి సింగ్ దేవ్.


