News October 14, 2025
ఎచ్చెర్ల: ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 42 శాతం ప్రవేశాలు’

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్ -2025 రెండో విడత కౌన్సిలింగ్ అలాట్మెంట్లను కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విద్యాలయంలో 19 పీజీ కోర్సుల్లో 600 సీట్లు ఉండగా 253 ప్రవేశాలు జరిగాయన్నారు. 42% ప్రవేశాలు మాత్రమే జరిగాయి. కనీసం పీజీ కోర్సులో 50% ప్రవేశాలు జరగకపోవటం గమనార్హం. కొన్ని కోర్సుల్లో కనీస ప్రవేశాలు జరగలేదు.
Similar News
News January 28, 2026
అజిత్ పవార్ మృతిపై మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి

మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందడం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించిన మంత్రి, పరిస్థితిని సమీక్షించేందుకు హుటాహుటిన ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లారు.
News January 28, 2026
SKLM: ఉపాధ్యాయుడి నుంచి ఎక్సైజ్ ఎస్ఐగా

సంతబొమ్మాళి మండలం శివరాంపురం ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చెట్టు రామారావు విజయం సాధించారు. మంగళవారం విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో ఆయన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రామారావు, గతంలో డీఎస్సీ ద్వారా టీచర్‌గా ఎంపికై సేవలు అందిస్తున్నారు. పట్టుదలతో చదివి ఇప్పుడు ఎస్ఐగా ఎంపిక కావడంతో ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
News January 28, 2026
ఎచ్చెర్ల: సెమిస్టర్ పరీక్షల వాయిదా

B.Ed 1వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వెల్లడించింది. పరిపాలనలో సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కళాశాలలు, కేంద్రాలకు తాజా ప్రకటన జారీ చేశారు. కాగా ఈ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.


