News October 14, 2025
ఎచ్చెర్ల: ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 42 శాతం ప్రవేశాలు’

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్ -2025 రెండో విడత కౌన్సిలింగ్ అలాట్మెంట్లను కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విద్యాలయంలో 19 పీజీ కోర్సుల్లో 600 సీట్లు ఉండగా 253 ప్రవేశాలు జరిగాయన్నారు. 42% ప్రవేశాలు మాత్రమే జరిగాయి. కనీసం పీజీ కోర్సులో 50% ప్రవేశాలు జరగకపోవటం గమనార్హం. కొన్ని కోర్సుల్లో కనీస ప్రవేశాలు జరగలేదు.
Similar News
News February 6, 2026
మందస: వాసుదేవుని బ్రహ్మోత్సవాలు.. కార్యక్రమాలు ఇవే

మందస శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ ఆలయంలో శనివారం నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాలలో భాగంగా కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. 7న ఆంజనేయస్వామి అభిషేకం, 8న వాసుదేవుని అభిషేకం, 9న శేషవహనసేవ, 10న కల్పవృక్ష వాహనం, ఎదుర్కోలు ఉత్సవం, 11న స్వామివారి కళ్యాణం, 12న తెప్పోత్సవం, అస్వవాహనసేవ, 13న చక్రస్నానం, రథోత్సవం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
News February 6, 2026
శ్రీకాకుళం: జాబ్ మేళాలో 327 మంది ఎంపిక

శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. వివిధ సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు 358 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయగా, 327 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో టాటా ఎలక్ట్రానిక్స్‌కు 151, హ్యుందాయ్ మోబిస్‌కు 49, ఇసుజు మోటార్స్‌కు 40, డెక్కన్ కెమికల్స్‌కు 58, అపోలో టైర్స్‌కు 17, ఇండోమిన్‌కు 12 మంది ఉన్నారని ప్రిన్సిపల్ తెలిపారు.
News February 6, 2026
‘మనమిత్ర’ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి: ఎస్పీ

ప్రజలకు పోలీసు సేవలను మరింత వేగంగా అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి కోరారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ మనమిత్ర సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సాంకేతికతను జోడించి పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేయడంలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు.


