News March 26, 2025
ఎచ్చెర్ల: బడివానిపేట వీఆర్వో ఆకస్మిక మృతి

ఎచ్చెర్ల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బడివానిపేట వీఆర్వో రాజారావు కార్యాలయంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. బుధవారం ఉదయం కార్యాలయానికి ఆయన వచ్చారు. సాయంత్రం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. తక్షణం సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News March 28, 2025
SKLM: జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే

శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను శుక్రవారం సాయంత్రం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించిన పలు పెండింగ్‌లో ఉన్న పనులపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే చర్చించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
News March 28, 2025
SKLM: రైలు ప్రయాణికులకు శుభవార్త

పలాస, శ్రీకాకుళం మీదుగా హైదరాబాద్(HYB)- కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07165 HYB- CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC- HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
News March 28, 2025
శ్రీకాకుళం: బాలల హక్కుల కార్యదర్శి నియామకం

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని మురపాక గ్రామానికి చెందిన వమరవెల్లి మణి బాబును జిల్లా బాలహక్కుల పరిరక్షణ వేదిక కార్యదర్శిగా శుక్రవారం రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదర్ నియమించారు. ఈ సందర్భంగా మణిబాబు మాట్లాడుతూ.. బాలల హక్కుల కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. బాల కార్మికులను గుర్తించడం, పాఠశాలల్లో డ్రాప్ ఔట్‌లను తగ్గించడం తన ప్రథమ కర్తవ్యం అని అన్నారు.