News July 17, 2024
ఎచ్చెర్ల మండల వాసికి నేషనల్ గ్లోబల్ ఐకాన్ అవార్డు

ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావు(పీఎస్ఆర్) విద్యా, సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా నేషనల్ గ్లోబల్ ఐకాన్ అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం వర్చువల్ విధానంలో ఆయనకు సర్టిఫికెట్ అందించారు.
Similar News
News February 19, 2026
శ్రీకాకుళం: 18-30 ఏళ్ల ఉన్న వారికే ఈ అవకాశం

నిరుద్యోగ యువతకు ఈనెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. సుధ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని నెహ్రూ యువ కేంద్రంలో ఉదయం 10 గంటలకు ఈ ఎంపికలు ప్రారంభం కానున్నాయి. టాటా క్యాపిటల్స్ లిమిటెడ్, ముత్తూట్ మైక్రో ఫిన్ లిమిటెడ్ హాజరుకానున్నారని, టెన్త్ ఇంటర్ ఆపై విద్యార్హత ఉండి, 18 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు గల వారు అర్హులన్నారు.
News February 19, 2026
SKLM: కన్నకొడుకుకు తలకొరివి పెట్టిన తల్లి.. PHOTO

శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడలో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో పెద్దకుమారుడు రాజు మృతి చెందగా, కన్నతల్లే కొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. గతంలో చిన్నకుమారుడు మరణించగా తండ్రి తలకొరివి పెట్టారు. ఇప్పుడు రెండో కుమారుడు కూడా దూరమవడంతో ఆ తల్లి కన్నీటిపర్యంతమై కొడుకుకు వీడ్కోలు పలికింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
News February 18, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

★శ్రీముఖలింగం: చక్రతీర్థస్నానాలకు పోటెత్తిన భక్తులు
★నందిగాం: వృక్షం వేర్లు ఆలయానికి రక్షణ
★వంశధార ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టి సారించాలి: ఎమ్మెల్యే బగ్గు
★పలాస: చైన్ స్నాచింగ్ చేస్తుండగా పట్టేశారు
★ఆదిత్యుని సన్నిధిలో ఐఆర్ఎస్ ప్రిన్సిపల్ కమీషనర్
★శ్రీకాకుళం: ఈనెల 20న జాబ్ మేళా
★ఎల్.ఎన్ పేట: నదీ తీరాన ఆకట్టుకున్న ఈశ్వరుని సైకత శిల్పాలు
★ఎచ్చెర్ల: తగ్గిన టమాట ధర


