News December 3, 2025
ఎచ్చెర్ల: మహిళ హత్య?

ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట జాతీయ రహదారి పక్కన మంగళవారం రాత్రి మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఎస్సై లక్ష్మణరావు ఆధ్వర్యంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి పరిశీలన జరుపుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 25, 2026
అరసవల్లి: భక్తులకు కలెక్టర్ కీలక ప్రకటన

అరవసల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఉత్సవాలలో భాగంగా భక్తులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. రథసప్తమి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారన్నారు. సాయంత్రం నాటికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు సుమారు 1.40లక్షలు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. వృద్ధులు, చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News January 25, 2026
SKLM: 10Th పాసైనా ఉద్యోగం

యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 27న ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి కే.సుధ శనివారం తెలిపారు. శ్రీకాకుళం RTC కాంప్లెక్స్ వెనుక ఉన్న నెహ్రూ యువ కేంద్రంలో ఎంపికలు ఉంటాయన్నారు. పేటీఎం సంస్థలో (10th పాస్‌తో) 55 ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటీవ్ పోస్ట్‌లు, సోలార్ ఎనర్జీలో (డిగ్రీతో) సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌లు ఉన్నాయన్నారు. అభ్యర్థులకు 18 ఏళ్ల వయసు నిండాలన్నారు.
News January 24, 2026
జలమూరులో యాక్సిడెంట్ స్పాట్‌లో ఒకరు మృతి

జలుమూరు మండలం చల్లవానిపేట చెరువు మలుపు వద్ద శనివారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. 14 ఏళ్ల బాలుడు ఋషి ఈ ప్రమాదంలో మృతి చెందాడు. చోదకుడితో పాటు బైక్‌పై ఉన్న వారికి గాయాలవ్వడంతో స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


