News December 12, 2025

ఎచ్చెర్ల: యూనివర్సిటీలో జాతీయ సదస్సు

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈనెల 18, 19 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు బి.ఆర్.ఏ.యు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య గురువారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. భారతదేశంలో విజ్ఞాన సమపార్జన, సంస్కృతి అనే అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తామన్నారు. విద్యారంగ నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని చెప్పారు.

Similar News

News March 4, 2026

SKLM: పాత నేరస్థులపై నిఘా, కౌన్సిలింగ్ తప్పనసరి

image

పాతనేరస్థులపై నిఘా, కౌన్సిలింగ్ తప్పనసరిని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ కోర్టు వ్యవహారాలు, నాన్ బెయిల్బుల్‌పై విస్తృతంగా చర్చించారు. నూతనంగా ప్రారంభించిన నేరాలు నియంత్రణ హిస్టరీ రికార్డులుపై ఆరా తీశారు.

News March 4, 2026

శ్రీకాకుళం: టెన్త్ పాస్..230 ఖాళీలకు జాబ్ మేళా

image

శ్రీకాకుళం ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 6న ఉదయం 10 గంటల కు ఉద్యోగ మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి సుధ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరబిందో ఫార్మా, అన్నపూర్ణ ఫైనాన్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ వంటి పలు సంస్థలు పాల్గొని, 230 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 18–35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అవసరమైన పత్రాలతో హాజరుకావాలని కోరారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News March 4, 2026

ఎచ్చెర్ల: డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 4వ సెమిస్టర్ షెడ్యూల్‌ను యూనివర్సిటీ డీన్ అనురాధ బుధవారం విడుదల చేశారు. మార్చి 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్షల ఫీజును చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 7వ తేదీ నుంచి జరుగుతాయని తెలిపారు.