News March 11, 2026
ఎచ్చెర్ల: రిజల్ట్స్ విడుదల

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ అనురాధ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఆమె వెల్లడించారు. https://brau.edu.in/ వెబ్‌సైట్‌ను విద్యార్థులు చూడాలని పేర్కొన్నారు.
Similar News
News March 29, 2026
నరసన్నపేట: సైబర్ మోసం.. బ్యాంకు ఖాతా ఖాళీ

సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకున్న యువకుడు ఖాతాలో డబ్బులు మాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం నరసన్నపేట మండలం కోమార్తి గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రిందట వాట్సాప్ లో వచ్చిన లింకుని ఓపెన్ చేయడంతో తన ఖాతాలో ఉన్న రూ.52,000 మాయం అయ్యాయని తెలిపాడు. పోలీసులకు శనివారం ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
News March 29, 2026
శ్రీకాకుళం: చికెన్ రూ.400.. గుడ్లు రూ.150

శ్రీకాకుళం జిల్లాలో చికెన్ ధర ఒక్కసారి పెరిగింది. రూ. 400 స్కిన్లెస్ ధర ఉంది. కొన్ని ప్రాంతాల్లో రూ. 350కు సైతం అంటున్నారు. లైవ్ రూ. 210కి అమ్ముతున్నారు. కోడిగుడ్ల ధర మాత్రం స్థిరంగా ఉంది. 30 గుడ్లు రూ.150కి అమ్ముతున్నారు. చికెన్ ధర ఒకసారి పెరగటంతో సామాన్యులకు ఆర్థిక భారంగా ఉంది. వేసవిలో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.
News March 29, 2026
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్..!

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శనివారం తెలిపారు. ప్రధానంగా బూర్జ, హిరమండలంలో వడగాల్పులకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎండలు అధికంగా ఉన్నందున అత్యవసరం అయితే తప్ప బయట తిరగరాదని ప్రజలను హెచ్చరించారు.


