News March 15, 2025
ఎచ్చెర్ల : రోడ్డు ప్రమాదంలో చెన్నై వాసి మృతి

జరజాం జంక్షన్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో చెన్నైకి చెందిన వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న బి.ఆకాశ్(35) శ్రీకాకుళం నుంచి విశాఖకు కారులో వెళ్తూ.. జరజాం జంక్షన్ సమీపంలో ముందువెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో డ్రైవ్ చేస్తున్న ఆకాశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News July 7, 2025
శ్రీకాకుళం IIITలో 149 సీట్లు ఖాళీ

శ్రీకాకుళం IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల భర్తీ ఇటీవల పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 867 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 149 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11, 12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.
News July 7, 2025
శ్రీకాకుళంలో నేడు పీజీఆర్‌ఎస్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నేడు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.
News July 6, 2025
ఆమదాలవలస: పార్ట్ టైం పేరుతో వెట్టి చాకిరి తగదు

పార్ట్ టైం పేరుతో వీఆర్ఏలతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని రాష్ట్ర వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు షేక్ బందిగీకి సాహెబ్ అన్నార. వీఆర్ఏ సంఘం 7వ జిల్లా మహాసభ ఆదివారం ఆమదాలవలసలో జరిగింది. వీఆర్ఏలు ఫుల్ టైం విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని, కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ మాదిరిగా రాష్ట్రంలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని కోరారు.