News October 24, 2025

ఎచ్చెర్ల: వర్సిటీలో క్యాంటీన్ నిర్వహణకు దరఖాస్తు గడువు పెంపు

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో క్యాంటీన్ నిర్వహణకు గడువు తేదీ పెంచినట్లు యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య బి.అడ్డయ్య పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీలోగా https://www.brau.edu.in వెబ్సైట్లో దరఖాస్తు ఫారం సబ్మిట్ చేయాలని ఆయన కోరారు. గతంలో ప్రకటించిన తేదీకి దరఖాస్తులు రాకపోవడంతో గడువు పెంచినట్లు ఆయన తెలియజేశారు. పూర్తి వివరాలకు98662 99401 ఫోన్ నెంబర్‌కు సంప్రదించాలన్నారు.

Similar News

News October 24, 2025

B.Ed పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed 3వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.30/-లు, పరీక్షల ఫీజు రూ.1305/-లతో కలిపి మొత్తం రూ.1335/-లను నవంబర్ 10వ తేదీ లోపు చెల్లించాలని ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ సూచించారు. హాల్ టికెట్లు నవంబర్ 15న, పరీక్షలు 25వ తేదీన జరుగుతాయన్నారు.

News October 24, 2025

రణస్థలం: బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటోడ్రైవర్‌పై కేసు

image

బాలికపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్న ఆటో డ్రైవర్‌ రామారావుపై కేసు నమోదైంది. రణస్థలం SI వివరాల మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అనారోగ్యం కారణంగా నిద్రపోవాలంటే మాత్ర వేసుకోవాల్సిందే. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ ఆటోడ్రైవర్ ఆయన కుమార్తెపై కన్నేశాడు. బాలిక తల్లికి మద్యం అలవాటు చేశాడు. వాళ్లు మత్తులో ఉండగా బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇటీవల తండ్రికి విషయం తెలిసి ఫిర్యాదు చేశారు.

News October 23, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

image

◈తాడేపల్లి ప్యాలెస్ నుంచి కల్తీ మద్యం సరఫరా: ఎమ్మెల్యే మామిడి
◈ టెక్కలి: నందెన్న ఊరేగింపులో ఘర్షణ..ఇద్దరిపై కేసు నమోదు
◈ మందస: చాపరాయి భూ సమస్యపై న్యాయం చేయాలి
◈అధ్వానంగా సరుబుజ్జిలి, కొత్తూరు ప్రధాన రహదారులు
◈ శ్రీకాకుళం: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
◈ సింధూర జలసిరిపై పలాస ఎమ్మెల్యే శిరీష సమీక్ష
◈ఎల్.ఎన్ పేట: శవ దహనానికి సవాలక్ష పాట్లు
◈ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న