News December 17, 2025

ఎచ్చెర్ల: ‘విద్యార్థులకు చట్టాలపై అవగాహన’

image

పోష్ చట్టం-2013, పోక్సో చట్టం-2012లను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని AP మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం ఎచ్చెర్లలోని ట్రిపుల్ ఐటీని ఆమె సందర్శించారు. మహిళా విద్యార్థుల సమస్యలు తెలుసుకుని, చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణకు పోష్ చట్టం పొందించబడిందని, దీని కింద 90 రోజుల్లో విచారణ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పిల్లల రక్షణకు కూడా పోక్సోలో కఠిన శిక్షలు ఉన్నాయని స్పష్టం చేశారు.

Similar News

News December 19, 2025

శ్రీకాకుళం జిల్లా సైనిక అధికారులుకి గవర్నర్ ప్రశంస

image

విజయవాడలోని లోక్ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా అధికారులును గవర్నర్ అబ్దుల్ నజీర్‌ ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజ, టైపిస్ట్ మురళి చేస్తున్న ఉత్తమ సేవలకు గాను గవర్నర్ చేతుల మీదగా సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అందుకున్నారు. సేవలు మరింత విస్తృతం చేయాలని గవర్నర్ సూచించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత ఉన్నారు.

News December 19, 2025

శ్రీకాకుళం: ఒకే కళాశాల నుంచి 25 మందికి అగ్నివీర్ ఉద్యోగాలు

image

విశాఖ, కాకినాడలో ఆగస్టు నెలలో జరిగిన అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌లో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల NCC విద్యార్థులు సత్తాచాటారు. ఈ అగ్నివీరు రిక్రూట్‌మెంట్‌లో 25 మంది ఉద్యోగాలు సాధించినట్లు ఇటీవల కాల్ లెటర్స్ వచ్చాయని ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్, NCC అధికారి పోలినాయుడు తెలిపారు. వీరిని శుక్రవారం అభినందించారు. NCCలో నైపుణ్య శిక్షణ, క్రమశిక్షణ, దేహదారుఢ్య శిక్షణ విద్యార్థులకు ఉపయోగపడిందన్నారు.

News December 19, 2025

ఎచ్చెర్ల: ఫలితాలు విడుదల

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://brau.edu.inలో పొందుపరిచినట్లు తెలిపారు. మొత్తం 178 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 85 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.