News March 27, 2026

ఎచ్చెర్ల: సెమిస్టర్ల ఎగ్జామ్ షెడ్యూలు విడుదల

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB(3Y)కి సంబంధించి 2, 4, 6వ సెమిస్టర్లు, (5Y)కి 2, 4, 6, 10 సెమిస్టర్ల పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 21వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నట్లు యూనివర్సిటీ డీన్ డాక్టర్ యు.జ్యోష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ.800, ప్రాక్టికల్ ఫీజు రూ.250లతో కలిపి మొత్తం రూ.1,050లను ఏప్రిల్ 12వ తేదీలోపు యూనివర్సిటీ, కళాశాలల్లో చెల్లించాలని కోరారు.

Similar News

News April 1, 2026

శ్రీకాకుళం: 14 కంపెనీల్లో 245 మందికి ఉద్యోగాలు

image

శ్రీకాకుళంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా జరిగింది. 14 కంపెనీలు హాజరుకాగా జిల్లా నలుమూలల నుంచి 741 మంది ఇంటర్వ్యూలకు వచ్చారు. పలు కేటగిరీల్లో 245 మందికి ఎంపిక కాగా నియామక పత్రాలను శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి హయాంలో యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. జిల్లా ఉపాధికల్పనాధికారి సుధ ఉన్నారు.

News April 1, 2026

అసిరితల్లి సిరిమానోత్సవాలు.. మంత్రికి ఆహ్వానం

image

కోట‌బొమ్మాళి మండ‌లం హరిశ్చంద్రపురం గ్రామంలో ఏప్రిల్ 20 నుంచి 28 వరకు గ్రామదేవత అసిరితల్లి సిరిమానోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ పెద్దలు, కార్యనిర్వహణ కమిటీ సభ్యులు మంత్రి అచ్చెన్నాయుడును సిరిమానోత్సవాలకు ఆహ్వానించారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను నిమ్మాడ క్యాంప్ కార్యాల‌యంలో మంత్రి మంగళవారం ఆవిష్కరించారు.