News January 28, 2026

ఎచ్చెర్ల: సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

B.Ed 1వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వెల్లడించింది. పరిపాలనలో సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కళాశాలలు, కేంద్రాలకు తాజా ప్రకటన జారీ చేశారు. కాగా ఈ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

Similar News

News February 8, 2026

SKLM: దారికాచిన మృత్యువు.. ఆసుపత్రికి వెళ్తూ..!

image

నందిగాం హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలిసిందే. ఒడిశాలోని సున్నాపురానికి చెందిన దాలయ్యను కారులో శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా ఘటన జరిగింది. ఇందులో ఇద్దరు మృతి చెందగా చంద్రముని, ముత్యాలమ్మ, నీలాద్రి, వెంకటేశ్, రామరావు తీవ్రంగా గాయపడ్డారు. రామారావు పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం తరలించారు. మిగిలిన వారికి టెక్కలిలో చికిత్స సాగుతోంది. భారతి అనే యువతి గాయల్లేకుండా బయటపడింది.

News February 8, 2026

శ్రీకాకుళం: రేపటి నుంచి ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు

image

విద్యాశాఖ ఆదేశాల మేరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు ఈనెల 9 తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని డీఈవో ఏ రవిబాబు తెలిపారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం డీఈవో కార్యాలయంలో ఆయన ప్రకటన విడుదల చేస్తూ ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఉదయం, మధ్యాహ్నం కూడా పరీక్షలు కొనసాగుతాయని ఇందుకు సంబంధించి ప్రశ్నాపత్రాలు ఆయా హెచ్ఎం‌లకు అప్పగించామన్నారు.

News February 8, 2026

SKLM: ‘జిల్లా అభివృద్ధికి పన్నులు వసూళ్లు తప్పనిసరి’

image

జిల్లా అభివృద్ధికి కీలకమైన పన్నుల వసూళ్లు తప్పనిసరని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వాణిజ్య పన్నుల శాఖ సమన్వయ కమిటీ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొని అధికారులుతో మాట్లాడారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. రెవిన్యూ పోలీస్ ఇంజనీరింగ్ వాణిజ్య పన్నులు శాఖ అధికారులు నిరంతరం సమాచారం పంచుకోవాలన్నారు.