News January 28, 2026

ఎచ్చెర్ల: సెమిస్టర్ పరీక్షల వాయిదా

image

B.Ed 1వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వెల్లడించింది. పరిపాలనలో సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కళాశాలలు, కేంద్రాలకు తాజా ప్రకటన జారీ చేశారు. కాగా ఈ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

Similar News

News February 9, 2026

SKLM: వరుస దొంగతనాలు.. ప్రజల హడల్

image

మందసలోని బాలిగాం గ్రామంలో వరుస దొంగతనాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. కిల్లి శారదమ్మ ఇంట్లో తులమున్నర బంగారం, వల్లభ భూదేవి ఇంట్లో ఆరు తులాల వెండి పట్టుకొని పోయారు. దాంతో పాటు మార్పు భుజంగరావు ఇంట్లో బీరువాలను తెరిచి చిందర వందరగా పడేశారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డ గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, మందస ఎస్ఐ కృష్ణప్రసాద్ వివరాలు సేకరించారు.

News February 9, 2026

శ్రీకాకుళం: టెన్త్ విద్యార్థులకు గమనిక

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జరగనున్న ఎగ్జామ్స్‌లో ఓ పరీక్ష తేదీని మార్చినట్లు డీఈవో రవి కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 20న జరగాల్సిన ఇంగ్లిషు పరీక్ష, ఆ రోజు రంజాన్ కావడంతో మరుసటి రోజు 21న నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మార్పును టీచర్లు, విద్యార్థులు గమనించాలన్నారు.

News February 9, 2026

ఈనెల 11న టెక్కలిలో మెగా జాబ్ మేళా

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 11న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయిబాబు తెలిపారు. ఈ ప్రాంగణ ఎంపికల్లో 12 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగి, 18-35 ఏళ్లలోపు వయసున్న యువతీయువకులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.