News May 19, 2024
ఎచ్చెర్ల: స్ట్రాంగ్ రూమ్ల పరిశీలించిన ఎన్నికల కమిషనర్
ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం శివాని కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ల పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన అక్కడి సిబ్బందికి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతీ ఒక్కరూ కౌంటింగ్ ప్రక్రియ వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిరంతరం పర్యవేక్షణలో ఉండాలని పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, ఎస్పీ రాధిక, డిఎస్పీ వై.శ్రుతి ఉన్నారు.
Similar News
News December 27, 2024
శ్రీకాకుళం: ‘మన్మోహన్ సింగ్తో అనుబంధం మరువలేనిది’
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గరువారం రాత్రి మన్మోహన్ సింగ్ మరణించడంతో ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను అచ్చెన్న సోషల్ మీడియాలో పంచుకున్నారు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఆయనతో అనుబంధం మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి అచ్చెన్న ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
News December 27, 2024
ఎచ్చెర్లలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఎచ్చెర్లలోని కేశవరెడ్డి స్కూల్లో అసోసియేట్ టీచర్ గనగళ్ల నీరజ(22) బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్ కుమార్ తెలిపిన వివరాల మేరకు గార మండలం కళింగపట్నం పంచాయతీ నగరాలపేటకు చెందిన నీరజ గడిచిన 6 నెలల నుంచి ఇదే స్కూల్ లో పనిచేస్తుంది. నీరజ తన గదిలో ఉన్న ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుంది. మృతి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
News December 27, 2024
శ్రీకాకుళం: మండల అధికారులతో జేసీ సమీక్షా
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జాయింట్ కలెక్టర్ మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్లె పండుగ పనులు, రైతుల సమస్యలతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఇందులో జిల్లా రెవెన్యూ అధికారి, ఉప కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.