News March 24, 2025
ఎటపాకకు చెందిన వ్యక్తి గోదావరిలో దూకి ఆత్మహత్య

ఎటపాకకు చెందిన అనిల్ అనే వ్యక్తి భద్రాచలం బ్రిడ్జి మీద నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 10 ఏళ్ల క్రితం అనిల్ భార్య రజిని ఆత్మహత్య చేసుకుందని, అప్పటి నుంచి అనిల్ మనోవేదనకు గురైన మద్యానికి బానిసయ్యాడన్నారు. ఈనెల 16న నుంచి మద్యం తాగడం మానేశాడని.. 20వ తేదీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
Similar News
News March 1, 2026
NCERTలో 117 ఉద్యోగాలు

NCERTలో 117 అకడమిక్ పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 6 ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, M.LSc, NET/SET/SLET, PhD/M.Phil, అర్హతతో పాటు టీచింగ్/ రీసెర్చ్ అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు రూ.57,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ncert.nic.in
News March 1, 2026
VKB: ఇంటర్ అడ్మిషన్ల పెంపుపై అధికారుల దృష్టి

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పెంచేందుకు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. ఈ మేరకు జూన్ 1 నుంచి విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలతో పాటుగా వివిధ రకాల వస్తువులు ఉండే ఒక కిట్టును అందజేయనుంది. ఇప్పటికే అధికారులు ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం ఆమోదిస్తే వికారాబాద్ జిల్లాలోని 13 జూనియర్ కళాశాలల్లోని సుమారు 3000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
News March 1, 2026
HYD: Way2Newsలో కథనం.. అధికారుల్లో చలనం

MMC ఘట్‌కేసర్ సర్కిల్ ముత్వెల్లిగూడలో నీటి లీకేజీపై Way2News కథనానికి అధికారులు స్పందించి మరమ్మతులు చేయించారు. ‘<<19260987>>నమ్మండి.. ఇది రోడ్డే..!<<>>’ శీర్షికన శనివారం పబ్లిష్ అయిన కథనంతో HMWSSB మల్కాజిగిరి ED పంకజ, CGM (E) సంతోష్ సదరు ప్రాంతాన్ని సందర్శించారు. 200mm డయా పైపు నీటి లీకేజీ సమస్యను పరిష్కరించారు. స్పందించి సమస్య తీర్చిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.


