News December 16, 2025

ఎట్టకేలకు అమ్ముడైన పృథ్వీ షా

image

యంగ్ బ్యాటర్ పృథ్వీషాకు ఎట్టకేలకు ఊరట దక్కింది. ఐపీఎల్-2026 మినీ వేలం తొలి రౌండ్‌లో షా అమ్ముడుపోలేదు. మరో రౌండ్‌లో బేస్ ప్రైస్ రూ.75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని సొంతం చేసుకుంది. గతంలో ఇతడు ఢిల్లీ తరఫునే ఆడారు. 79 మ్యాచుల్లో 1,892 రన్స్ చేశారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లు జేమీసన్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ, ఆడమ్ మిల్నేను రూ.2.4 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది.

Similar News

News December 25, 2025

RCB స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు షాక్

image

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న RCB స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు జైపూర్ పోక్సో కోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. విచారణ కీలక దశలో ఉండగా బెయిల్ సముచితం కాదని పేర్కొంది. క్రికెట్‌లో సలహాలిస్తానంటూ హోటల్‌కు పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు రాజస్థాన్‌కు చెందిన ఓ అమ్మాయి ఫిర్యాదుతో పోలీసులు దయాల్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడే ఆస్కారముంది.

News December 25, 2025

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్

image

సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘థాయ్ కిళవి’ సినిమా కోసం పూర్తిస్థాయి గ్రామీణ వృద్ధురాలి పాత్రలో ఒదిగిపోయారు. మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తూ ‘ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో’ అంటూ ఆమె పాత్ర గురించి చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది.

News December 25, 2025

డిసెంబర్ 25: చరిత్రలో ఈ రోజు

image

✒ 1861: సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యా జననం
✒ 1924: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(ఫొటోలో) జననం
✒ 1971: డైరెక్టర్ కరుణాకర్ జననం
✒ 1972: భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి మరణం
✒ 1974: ప్రముఖ నటి, రాజకీయ నేత నగ్మా జననం
✒ 1981: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ జననం
✒ సుపరిపాలన దినోత్సవం