News February 28, 2025

ఎడపల్లి: గేదెలను కడగడానికి వెళ్లి వ్యక్తి మృతి

image

ఎడపల్లి పులి చెరువులో గురువారం సాలూర మండల కేంద్రానికి చెందిన మంగలి రమేశ్(35) గేదెలను కడగడానికి చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.

Similar News

News February 28, 2025

NZB: DJ సౌండ్ ఎఫెక్ట్.. కుప్పకూలి వృద్ధురాలి మృతి

image

DJ సౌండ్ ఓ వృద్ధురాలి ప్రాణాలను బలిగొంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర బైపాస్ రోడ్‌లో జరిగింది. కలెక్టరేట్ వెళ్లే రహదారిలో నివాసముండే కె.భారతమ్మ (70) గురువారం రాత్రి తన ఇంటి సమీపంలో ఓ వేడుక జరుగుతుంటే చూడడానికి వెళ్లింది. అయితే అక్కడ DJ సౌండ్‌కు ఆమె అక్కడే కుప్పకూలగా హుటాహుటినా ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

News February 28, 2025

NZB: మార్చ్‌1న జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు

image

నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చ్‌1న జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.విజయ్ కాంత్ రావు తెలిపారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్ వద్ద ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. అండర్ 14, 16, 18 బాలికలతో పాటు మహిళ, పురుషులకు వేరువేరుగా ఎంపికలు ప్రక్రియ ఉంటుందన్నారు. ఎంపికైన వారిని హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామన్నారు.

News February 28, 2025

NZB: జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు

image

NZB జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 81 కేంద్రాలు ఉండగా, పట్టభద్రులకు సంబంధించి 48, ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు ఉపాధ్యాయ నియోజకవర్గానికి 92.46% పోలింగ్ నమోదు కాగా, పట్టభద్రులకు సంబంధించి సంబంధించి 77.24% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. బ్యాలెట్ బాక్స్‌లను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలించారు.

error: Content is protected !!